Home  »  TV News  »  ముకుంద ఎవరిని ప్రేమించిందో తెలుసుకోవాలని మురారికి చెప్పిన భవాని!

Updated : Jul 11, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -205 లో.. కృష్ణని ప్రేమిస్తున్నానని నిజం చెప్పలేక సతమతమవుతాడు మురారి. చెప్పండి ఏసీపి సర్.. ఒకవేళ అది తప్పు అయినా నేను ఏం అనను అర్థం చేసుకుంటానని కృష్ణ అంటుంది. నేను కళ్ళు మూసుకుంటాను మీరు చెప్పండని కృష్ణ అనగానే.. మురారి చెప్పాలనుకొని చెప్పలేకపోతాడు. అప్పుడే అలేఖ్య వచ్చి.. నిన్ను భవాని అత్తయ్య రమ్మంటుందని మురారిని పిలుస్తుంది.

ఆ తర్వాత గీతికను అడిగితే తను అబద్దం చెప్పింది. గీతిక ముకుందని కలిసిందో లేదో తననే వెళ్లి కనుకుంటా అని ముకుంద దగ్గరికి వెళ్తుంది కృష్ణ. అక్కడ గదిలో ముకుంద, మురారి కలిసి ఉన్న  ఫోటో పట్టుకొని చూస్తూ.. నన్నెలా మర్చిపోయావ్ అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ముకుంద దగ్గరికి కృష్ణ వస్తుంది. కృష్ణని చూసి టెన్షన్ గా ఫోటో కింద పడేస్తుంది ముకుంద. కృష్ణ వచ్చి ఆ ఫోటో చూడకుండా ముకుందకి ఇస్తుంది. ఏంటి కృష్ణ ఏదో ఆడాగాలని వచ్చినట్లు ఉన్నావని ముకుంద అడుగుతుంది. గీతిక ఏమైనా వచ్చిందా అని కృష్ణ అడుగుతుంది. లేదు, ఎందుకు‌ అలా అడుగుతున్నవని ముకుంద అడుగగా.. కాజువల్ గా అడిగాననని కృష్ణ చెప్తుంది. మరొక వైపు భవాని దగ్గరికి మురారి వస్తాడు. ఆదర్శ్ గురించి తెలుసుకుంటానని మాట ఇచ్చావ్..

ఇప్పటివరకు కనుక్కోలేదు. అసలు ఆదర్శ్ గురించి ఇంత వెతికిస్తున్నాం అయినా తెలియట్లేదంటే ఆదర్శ్ కి ఈ ఇంటికి రావడం ఇష్టం లేదని శ్రీనివాస్ అన్నాడు. ఆదర్శ్ కి ఇక్కడికి రావడం ఇష్టం లేదేమో.. పెళ్లికి ముందు ఆదర్శ్ ఎవరైనా ప్రేమించాడా అని మురారిని భవాని అడుగుతుంది. అదేం లేదు పెద్దమ్మ అని మురారి అంటాడు. మరి ముకుంద ఎవరైనా ప్రేమించిందేమో? ఆ విషయం తెలిసి వెళ్ళిపోయాడెమో అని భవాని అంటుంది. నువ్వు చెప్పింది నిజం అని ఎలా చెప్పాలి పెద్దమ్మ అని మురారి తన మనసులో అనుకుంటాడు. నువ్వు అన్ని విషయాలు కనుక్కుంటానని మాట ఇవ్వు అని మురారితో భవాని అంటుంది. సరేనని మురారి మాట ఇస్తాడు. నువ్వు ఇదివరకు ఒకసారి మాట తప్పావు.. మళ్ళీ ఇప్పుడు మాట తప్పితే జీవితంలో క్షమించనని భవాని అంటుంది. 

మరొక వైపు మురారి గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంటాడు. ఏదో చెప్తాను అన్నారు కదా చెప్తారా అని కృష్ణ అడుగుతుంది.. లేదు కృష్ణ తర్వాత చెప్తానని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.